లాక్‌డౌన్ నేపథ్యంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడకుండా కృష్ణా జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డయాలసిస్ రోగుల కోసం 15 ప్రైవేట్ ఆసుపత్రులు గుర్తించామని వాటిలో ఉచితంగా చికిత్స పొందొచ్చని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గుడివాడ, విజయవాడ, మచిలీపట్నం పట్టణాల్లో ఈ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం, జగ్గయ్యపేటలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ డయాలసిస్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇవీ చదవండి