విచిత్రం.. 20 అడుగుల ఎత్తు.. రెండేళ్లుగా కాపు.. - అవనిగడ్డలోని రైతు పెరట్లో రెండేల్లుగా కాపు కాస్తున్న కంది తాజా వార్తలు
కంది మొక్క అనగానే.. మహా అయితే మనిషంత ఎత్తు ఎదుగుతుంది. లేకుంటే మరో రెండు మూడు అడుగులు ఎక్కువ పెరుగుతుంది. సీజన్‌లో మాత్రమే కాపు కాస్తుంది. కానీ కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో శ్రీరామమూర్తి పెరట్లో పెరిగిన కంది మొక్క.. గత రెండు సంవత్సరాల నుంచి కాయలు కాస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది.

20 అడుగుల ఎత్తు పెరిగిన కంది మొక్క
కృష్ణా జిల్లా అవనిగడ్డలోని బచ్చు శ్రీరామమూర్తి పెరట్లో కంది మొక్క ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి కాయలు కాస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది. ఆ మొక్కకు ఏ విధమైన ఎరువులు కానీ రసాయనిక మందులు కానీ వాడలేదని.. యజమాని తెలిపారు. ప్రతి సీజన్‌లో సుమారు 4 కేజీల వరకు కంది కాయలు దిగుబడి ఇస్తుందని వెల్లడించారు. ఇటువంటి మొక్కలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని కోరారు.