కృష్ణాజిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో వరుస పాముకాట్లు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. తాజాగా సిద్ధార్థనగర్‌కు చెందిన గుగులోతు నాగులు పొలం పనులు చూసుకుని తిరిగి వస్తుండగా పాము కాటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు. గడిచిన మూడు రోజులుగా ముగ్గురు పాముకాట్లకు గురైనట్లు వైద్యులు అనిల్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పాముల సంచారంతో ప్రజలు ఇంటినుంచి బయటకువచ్చేందుకు భయపడుతున్నారు. అధికారులు తగిన జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి.