కృష్ణా నదిలో 10 మంది గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెం శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. వారు ఉన్న దిబ్బ మునిగిపోవటంతో మరో దిబ్బపైకి చేరుకున్నారు. మరో 4 అడుగులు వరద పెరిగితే రెండో దిబ్బ మునిగే ప్రమాదం ఉందని కాపరులు ఆందోళన చెందుతున్నారు. కాపరులతో పాటు 600 గొర్రెలు దిబ్బలపైకి చేరుకున్నాయి.
ఇదీచదవండి