విజయవాడ నగర సమీపంలోని రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే క్లాస్ రూంలో నీరు చేరి పాఠశాల విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తుంది. దీనిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ పాఠశాలలో వర్షపు నీరు చేరి పాములు, విష పురుగులు క్లాస్ రూంలో చేరుతుందని విద్యార్థులు తెలిపారు. దీంతో తాము పాఠాలు చదువుకోవాలంటే బయట కూర్చుని చదువుకోవాల్సి వస్తుందంటూ వాపోయారు. విషయంపై అధికారులు స్పందించాలని... లేకుంటే తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :