కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన మైలా నాగరాజు భార్య మాధవికి ఇద్దరు పిల్లలు స్వాతి, ఓంకార శ్రీ. బాబు పేరును రేషన్ కార్డులో జత చేయుటకు గతంలో మీసేవలో దరఖాస్తు చేసుకోగా.. ఏప్రిల్లో బాబు పేరునా కూడా కొత్త కార్డు మంజూరైందని సచివాలయ సిబ్బంది తెలిపారు. కార్డుని డిలిట్ చేయటానికి తమ లాగిన్లో అవకాశం లేదని వారు చెప్పారు. రేషన్ కార్డు కుటుంబ పెద్ద పేరు ఓంకార శ్రీ పేరునా ఫోటోతో కూడిన కార్డుతో సహా బాలుడికి బియ్యం కూడా మంజూరు చేసి వాలంటీర్ ద్వారా ఏప్రిల్లో ఇంటికి పంపించడం జరిగింది. అంతేకాదు లాక్డౌన్లో ప్రభుత్వం మంజూరు చేసిన వెయ్యి రూపాయలు నగదు కూడా బాలుడికి అందింది.
జత చేయమంటే యజమానిని చేశారు..
మా బాబుని తమ రేషన్ కార్డు లో జాయిన్ చేయమంటే ఏకంగా ఏడు సంవత్సరాల బాబుకి బియ్యం కార్డు ఇవ్వడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నించారు. కార్డును రద్దు చేయమని కోరగా 8 నెలల నుంచి కోరుతున్నా కార్డు రద్దు చేయడం లేదని అన్నారు. అధికారులు ఇప్పటికైనా జరిగిన పొరపాటును నిశితంగా పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని నాగరాజు కోరుతున్నాడు.
ఇదీ చదవండి: గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం!