ETV Bharat / state

దంపతుల మధ్య గొడవ.. ఏడుగురికి గాయాలు - దంపతుల మధ్య గొడవలో ఏడుగురికి గాయాలు తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఏడుగురికి గాయాలైన ఘటన.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పున్నవల్లిలో జరిగింది. కొంతకాలంగా దివ్య, ప్రవీణ్ దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు.

seven injured in conflict between wife and husband at krishna district
దంపతుల మధ్య గొడవ.. ఏడుగురికి గాయాలు
author img

By

Published : Jun 6, 2021, 8:04 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పున్నవల్లిలో.. భార్యాభర్తల కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఏడుగురికి గాయాలయ్యాయి. కొంతకాలంగా దివ్య, ప్రవీణ్ దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. తరచూ గొడవలు జరుగుతున్నాయంటూ చందర్లపాడు పోలీస్ స్టేషన్‌లో దివ్య ఫిర్యాదు చేసింది. దీనిపై ఆగ్రహించిన ప్రవీణ్.. బంధువులతో కలిసి భార్య ఇంటికి వెళ్లాడు. మాటామాట పెరిగి భార్యపై దాడి చేశాడని, అడ్డుకునేందుకు యత్నించిన వారిని కొట్టినట్లు దివ్య బంధువులు తెలిపారు. ఈ గొడవలో ఇరువైపుల ఏడుగురికి గాయాలవ్వగా.. నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: Lady Fraud: మాయమాటలు చెప్పి లక్షల్లో దోచేసింది..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.