ETV Bharat / state

జోరుగా.. రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ - రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ఈ విడతలో టీకా తీసుకుంటున్నారు.

ప్రారంభమైన రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

author img

By

Published : Feb 4, 2021, 12:40 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో విడత మొదలైంది. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, పంచాయితీ రాజ్ శాఖ సిబ్బంది ఈ విడతలో టీకాలు తీసుకుంటున్నారు. వీరితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, 104, 108 సిబ్బంది సైతం వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాము ఆరోగ్యంగానే ఉన్నామని .. ప్రతి ఒక్కరూ భయపడకుండా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని వారంతా కోరుతున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ నిర్వహణపై వైద్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వ్యాక్సిన్ తీసుకునే ఫ్రంట్ లైన్ సిబ్బంది వివరాలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గతంలో 80 ఉన్న వ్యాక్సినేషన్ సెషన్ సైట్లను 100కు పెంచినట్లు జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లాలో 11,802 మంది పోలీసులు, 18,996 మున్సిపల్ సిబ్బంది, 2,867 మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.