ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అంశంపై విజయవాడ కేబీఎన్ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. ఎంతవరకు సంక్షేమ ఫలాలు గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతున్నాయి అనే అంశాలపై చర్చిస్తామని ఫ్రోఫెసర్ మల్లయ్య తెలిపారు. సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీలకు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురు మేధావులు సూచనలు చేస్తారన్నారు. ఈ తరహా జాతీయ సెమినార్ నిర్వహించడం ఇదే మొదటి సారని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఎస్సీ, ఎస్టీ కేసులు వంద శాతం నిజాలే'