రాయలసీమలో వర్షాల జోరు కొనసాగనుంది. తాజాగా ఏర్పడిన ఉపరితల ద్రోణీ ప్రభావంతో సీమలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి : శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి- 4 గేట్లు ఎత్తివేత