ETV Bharat / state

ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ క్లినిక్‌‌.. - ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ క్లినిక్ వార్తలు

కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆర్టీసీ బస్సులను భాగస్వామ్యం చేసింది ప్రభుత్వం. కరోనా మహమ్మారి విస్తరిస్తోన్నపరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ టెస్టింగ్ వాహనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మొబైల్ క్లినిక్​లుగా.. 52 ఆర్టీసీ ఏసీ బస్సులు సిద్ధం అవుతున్నాయి.

rtc corona mobile testing bus
rtc corona mobile testing bus
author img

By

Published : Jun 10, 2020, 5:22 PM IST

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ కారణంగా ఆర్టీసీ ఏసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం వినియోగించనుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ టెస్టింగ్ వాహనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. కొత్త బస్సులు కొనాలంటే.. ఆర్థికంగా భారం పడుతుంది. డిపోలకే పరిమితమైన ఏసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. అధికారులకు వచ్చిన ఓ ఆలోచనతో ఆర్టీసీ బస్సుల రూపు మారింది.

వైద్య ఆరోగ్య శాఖ వినతి మేరకు ఎసీ బస్సులను మొబైల్ మెడికల్ క్లినిక్ వాహనాలుగా మార్చుతున్నారు. ప్రయోగాత్మకంగా విజయవాడలోని ఓ ఇంద్ర బస్సును మార్చారు. కరోనా పరీక్షలుచేసేందుకు వీలుగా ఈ బస్సులోని సీట్లన్నీ తొలగించారు. వైద్య సిబ్బంది తమ రెండు చేతులు బయటకు పెట్టి నమూనాలు తీసేందుకు వీలుగా బస్సుల అద్దాలకు రంద్రాలు చేశారు. లోపల సిబ్బంది కూర్చునేందుకు వీలుగా పది కుర్చీలను ఏర్పాటు చేశారు. ఒకవైపు ఐదు, మరో వైపు ఐదుగురు కూర్చుని అనుమానితుల నుంచి కరోనా పరీక్ష నమూనాలు తీసేందుకు అనువుగా తయారుచేశారు. ఒకేసారి 10 మంది నమూనాలు తీసేలా ఏర్పాట్లు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది , వైద్య పరికరాలతో గ్రామీణ ప్రాంతాలకు ఈ బస్సు వెళ్లేందుకు సిద్ధం చేశారు. అనుమానిత ప్రాంతాలన్నింటిలోనూ కరోనా పరీక్షలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ అధికారులు దీన్ని రూపొందించి.. వైద్య ఆరోగ్య శాఖకు తాత్కాలికంగా అప్పగించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలా.. 52 ఏసీ బస్సులను కరోనా పరీక్ష వాహనాలుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు మార్పులు చేసి కరోనా పరీక్షా కేంద్రాలుగా మార్చే బాధ్యతను ‘అంబా బాడీ బిల్డ్ సంస్థ’కు అప్పగించింది. జిల్లాకు కొన్ని బస్సుల చొప్పున.. మారు మూల ప్రాంతాలకు వెళ్లి అక్కడే పరీక్షలు చేసి వెంటనే నివేదిక ఇచ్చేలా.. ఏసీ బస్సులను రూపుదిద్దుతున్నారు. కరోనా మహమ్మారి అంతమయ్యే వరకు అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీలోని కొన్ని ఏసీ బస్సులు ఇలా పరీక్షా కేంద్రాలుగా సేవలందించనున్నాయి.

ఇదీ చదవండి: 'చేదోడు కాదది.. జగన్మాయ పథకం... అబద్ధమే వైకాపా ఆయుధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.