ETV Bharat / state

ROBBERY: నందిగామలో వరుస చోరీలు.. భయాందోళనలో ప్రజలు - krishna district news

కృష్ణా జిల్లా నందిగామ కొంత కాలంగా వరుస చోరీలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా దొంగలు జాతీయ రహదారి పక్కనున్న ఓ ఎలాక్ట్రానిక్ షాపులో లూటీ చేశారు.

ROBBERY
ROBBERY
author img

By

Published : Sep 6, 2021, 10:45 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో దొంగలు భీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న శాంసంగ్ ఎలక్ట్రానిక్ షాపు షట్టర్ తాలలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. షాపులోని క్యాష్ కౌంటర్​లో ఉన్న రూ. 80 వేల నగదు దోచుకెళ్లారు. షాపులో ఇతర వస్తువులను దొంగిలించారా లేదా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

వరుస చోరీలు..

శాంసంగ్ ఎలక్ట్రానిక్ షాపు చోరీ దృశ్యాలు...

ఇటీవల నందిగామ ప్రాంతంలోని కంచికచెర్ల మండలం చెవిటికల్లులో ఓ ఇంట్లో దొంగతనం జరగగా, నందిగామలో పట్ట పగలు మహిళ మెడలో బంగారు గొలుసును దుండగులు దోచుకెళ్లారు. వరుస సంఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు రాత్రి సమయంలో గస్తీ పెంచాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

EX MINISTER DEVINENI UMA: 'రైతుల హక్కులను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.