రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఓ వ్యక్తితో పాటు ...30 గొర్రెలు మృతి చెందాయి. అలాగే పలువురు గాయపడ్డారు.
బుక్కరాయసముద్రం...
బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ సమీపంలో ఓ టిప్పర్ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 30కి పైగా గొర్రెలు మృతి చెందాయి. రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు రోదిసున్నాడు. గొర్రెల కాపరులు నీలారెడ్డిపల్లి గ్రామ కావడంతో గొర్రెలను పగలంతా మేత మేపుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
కంచికచర్ల ప్రమాదం...
కృష్ణాజిల్లా కంచికచర్ల 65వ నంబరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున కారు, స్కూటీని ఢీకొన్నది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జనరల్ హాస్పిటల్ కు తరలించారు. మృతుడు కంచికచెర్ల కు చెందిన ఎస్కే నాగూర్ బాబు గా గుర్తించారు. కంచికచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జొన్నాడ రోడ్డు ప్రమాదం...
ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి తలకు బలమైన గాయం అవడంతో... ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. వాడపాలెం గ్రామానికి చెందిన సాకా రత్నరాజు కడియపులంక పూల మార్కెట్ నుంచి పూల కొనుగోలు చేసుకుని తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మార్గ మధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి మిత్రులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇదీ చదవండీ...రోడ్లపై యువకుల వేడుకలు.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు