కృష్ణా జిల్లా 65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రి, కుమార్తె మృతి చెందారు. భార్య, మరో కుమార్తెకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్‌పై దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రయాణిస్తున్నారు. బాధితులు నాగాయలంక మండలం తలగడదీవి గ్రామానికి చెందిన దోమ సుకుమార్, రాధికగా గుర్తించారు. వీరు హైదరాబాద్లోని కుషాయిగూడ ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బంధువుల శుభకార్యం నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. తిరిగి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తండ్రి దోమ సుకుమార్, చిన్న కుమార్తె ఐశ్వర్య మృతి చెందారు.
ఇదీ చదవండి: కడప ఉక్కు భాగస్వామికి ఆర్థిక కష్టాలు