కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు వాసులుగా వారిని గుర్తించారు. జొన్నలగడ్డ నుంచి 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్... బోల్తా పడింది.