ETV Bharat / state

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా.. గ్యాస్‌ సిలిండర్‌ను 500 రూపాయలకే! : రేవంత్ రెడ్డి - తెలంగాణ తాజా వార్తలు

Revanth Reddy Padayatra in bhadradri: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. గ్యాస్‌ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెబుతున్న ప్రధాని మోదీ హయాంలో వస్తువుల ధరలు రెండింతలు అయ్యాయని విమర్శించారు. పోడు భూములపై కేసీఆర్​ చెప్పే మాటలను మరోసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు.

హాథ్‌ సే హాథ్‌ సే జోడో యాత్ర
హాథ్‌ సే హాథ్‌ సే జోడో యాత్ర
author img

By

Published : Feb 14, 2023, 4:33 PM IST

Revanth Reddy Padayatra in bhadradri : హాథ్‌ సే హాథ్‌ సే జోడో యాత్రలో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించారు. పాదయాత్రలో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాత్రి మణుగూరు అంబేడ్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్​ పార్టీ అధ్యక్ష్య పదవినైనా దళితుడికి కట్టబెట్టగలరా? అని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

ప్రజాపోరాటాలు, యువకుల త్యాగాలను చూసి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే... కేసీఆర్ జనం ఆకాంక్షాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములపై తొమ్మిదేళ్లుగా ఏం చేయని కేసీఆర్.. 9 నెలల్లో ఏదో చేస్తామని హామీ ఇస్తున్నారని విమర్శించారు. మోదీ పాలన కంటే మన్మోహన్‌ నయమని చెబుతున్నసీఎం... నోట్ల రద్దు, జీఎస్​టీ సహా అనేక అంశాల్లో ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు.

"మన్మోహన్​ పాలనలో దేశం బాగుంది, మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో అంటున్నారు. మరి అలాంటిది నోట్ల రద్దు, జీఎస్​టీ బిల్లు, ట్రిపుల్​తలాక్​ మొదలైన అనేక అంశాల్లో ఎందుకు మద్దతిచ్చారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, బీఆర్​ఎస్​ దొరల పార్టీ, కాంగ్రెస్​ పార్టీ పేదోల పార్టీ, దళితుల పార్టీ. కాంగ్రెస్​ పార్టీ జాతీయాద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే దళిత వర్గానికి చెందిన వ్యక్తి. బీఆర్​ఎస్​ పార్టీలో దళిత వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయకపోయినా పార్టీ అధ్యక్షుడిగానైనా నియమించాలని సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయాలకే సిలిండర్​ ఇస్తాం. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి తోడ్పడతాం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చూస్తాం. ముఖ్యంగా రైతుల సాదకబాధకాలకు చరమగీతం పాడతాం. " - రేవంత్​ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు

ఇసుక దందా, పార్టీ ఫిరాయింపు దందా సాగించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఇంటికి పంపించాలని ప్రజల్ని కోరారు. డబుల్‌ ఇంజిన్‌ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రధాని మోదీ పాలనలో... అభివృద్ధి కంటే నిత్యావసరాల వస్తువుల ధరాలు రెట్టింపయ్యాయని విమర్శించారు. ఈ భారాన్ని తగ్గించి పేదల కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 500రూపాయలకే సిలిండర్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ రేవంత్‌ హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో సాగనుంది.

ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే రేవంత్‌ రెడ్డి : ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండనున్న రేవంత్‌రెడ్డి.. అందుకు తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికైతే మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేందుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలల్లో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలు మొదలు అవుతాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

హాథ్‌ సే హాథ్‌ సే జోడో యాత్ర

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.