నూజివీడులో రెడ్ అలెర్ట్ ప్రకటించినా గుంపులుగా జనసందోహం రావడం చూసి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నూజివీడు పట్టణంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కొందరు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మాంసం కోసం ఎగబడ్డారు. అప్పటికే తెరిచిన దుకాణాల వద్ద జనసందోహం పెరిగిపోయింది. ఫలితంగా స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... దీపాలు వెలిగించాలని సీఎం ట్వీట్.. స్పందించిన ప్రధాని