ETV Bharat / state

అక్రమంగా నిల్వ చేసిన రేషన్​ బియ్యం పట్టివేత - చౌకధరల దుకాణంపై విజిలెన్స్ అధికారుల దాడులు

విజయవాడ శ్రీనగర్​ కాలనీలో చౌకధరల దుకాణంపై విజిలెన్స్​, పౌరసరఫరా శాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యం స్వాధీనం చేస్తున్నారు.

ration rice seized at Vijayawada krishna district
అక్రమంగా నిల్వ చేసిన రేషన్​ బియ్యం పట్టివేత
author img

By

Published : Oct 7, 2020, 3:31 PM IST

కృష్ణా జిల్లా విజయవాడలోని ముత్యాలంపాడు శ్రీనగర్ కాలనీలోని రేషన్ దుకాణంపై విజిలెన్స్​, పౌరసరఫరా శాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శ్రీనగర్ కాలనీలోని డిపో-214లో నిల్వ ఉంచిన సుమారు 1200 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. విజిలెన్స్ ఎస్​పీఏస్​పీటీ కనకరాజు బియ్యం డిపోకు చేరుకుని పెద్దఎత్తున ఉన్న ప్రజా పంపిణీ బియ్యం నిల్వలను పరిశిలించారు.

అప్పటకే 62 టన్నుల బియ్యం రేషన్ దుకాణంలో గుర్తించిన పౌర సరఫరా శాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఈ తనిఖీల్లో సీఐ అశోక్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టర్ విజిలెన్స్ ఎమ్ వెంటేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.