ETV Bharat / state

పవన్ కల్యాణ్​తో రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ

నేషనల్ ప్రొడక్షన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ డీలర్స్ ఫెడరేషన్ అఫ్ ఏపీ ప్రతినిధులు.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. రేషన్ డీలర్ల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిపై ఖచ్చితంగా స్పందిస్తానని తెలిపారు.

పవన్ కల్యాణ్​తో రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ
పవన్ కల్యాణ్​తో రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ
author img

By

Published : Feb 13, 2021, 12:19 PM IST

రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిపై ఖచ్చితంగా స్పందిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నేషనల్ ప్రొడక్షన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ డీలర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. వృత్తిపరమైన భద్రత లేకపోవడం గురించి వారు.. పవన్‌కు వివరించారు.

కరోనా మహమ్మారి సమయంలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన వస్తువులను పంపిణీ చేశామని సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవ రావు తెలిపారు. రవాణా, అన్​లోడ్ ఛార్జీలు, మార్జిన్ మొత్తానికి ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలో మార్పు కారణంగా సుమారు 58వేల కుటుంబాలు వారి జీవనోపాధిని కోల్పోయ్యాయని వివరించారు. కరోనా కారణంగా సుమారు 50 మంది డీలర్లు మరణించినా వారికి ఇప్పటివరకూ ఎలాంటి సహాయం అందలేదని చెప్పారు. రేషన్ డీలర్లకు ఫ్రంట్‌లైన్ యోధులతో సమానంగా వ్యాక్సిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ స్పందించి.... తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఇదీ చదవండి: అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.