ETV Bharat / state

గుడివాడలో పునుగు పిల్లి ప్రత్యక్షం.. చూసేందుకు తరలివచ్చిన ప్రజలు - కృష్ణ జిల్లా లేటెస్ట్ న్యూస్

Rare Punugu pilli At Gudiwada: ఓ వ్యక్తి పురాతన ఇంట్లో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు దాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ అరుదైన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

Rare Punugu pilli At Gudiwada
గుడివాడలో అరుదైన పునుగు పిల్లి
author img

By

Published : Apr 6, 2023, 12:00 PM IST

Updated : Apr 6, 2023, 2:23 PM IST

గుడివాడలో అరుదైన పునుగు పిల్లి

Rare Punugu pilli At Gudiwada: కృష్ణా జిల్లా గుడివాడలో ఓ అరుదైన వన్యప్రాణి ప్రత్యక్షమైంది. నాగవరప్పాడులోని ఔషధ వ్యాపారి నాగరాజు అనే వ్యక్తి తన పురాతన ఇంటిని తొలగిస్తుండగా ఇంటి కప్పుపై టార్పన్ల కింద ఉన్న ఓ జీవిని చూసి బంధించాడు. వెంటనే తనకు పరిచయం ఉన్న వెటర్నరీ అధికారులకు ఈ విషయం గురించి సమాచారం అందించాడు. కాగా నాగరాజు బంధించిన జీవి అరుదుగా ఉండే పునుగు పిల్లిగా అధికారులు నిర్ధరించారు. ఈ సంగతి తెలుసుకుని కంగారుపడిన నాగరాజు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.

సాధారణంగా దట్టమైన అడవుల్లో మాత్రమే ఉండే అంతరించిపోయే జాతికి చెందిన ఈ పునుగు పిల్లి జనావాసాల మధ్య ప్రత్యక్షమవ్వటం చాలా విచిత్రమైన విషయమని నిపుణులు అంటున్నారు. ఎంతో విశిష్టతను కలిగి ఉన్న ఈ పునుగు పిల్లిని మీడియాలో చూడడమే తప్ప, ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి అని నాగరాజు అన్నాడు. ఈ విషయం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందని అన్నాడు. పునుగు పిల్లి నాగరాజు ఇంట్లో ఉందని తెలుసుకున్న గ్రామస్థులు భారీ ఎత్తున అతడి ఇంటికి తరలివస్తున్నారు. వారంతా పునుగు పిల్లిని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పునుగు పిల్లులను శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేకంగా పెంచి.. వీటి తైలాన్ని స్వామివారి పూజాది కార్యక్రమాల్లో ఉపయోగిస్తారని పశు సంవర్ధశాఖ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఈ రకమైన పిల్లులు కనిపించడం చాలా అరుదని పేర్కొన్నారు.

"మేము మా పురాతన ఇల్లు తొలగిస్తుండగా.. ఇంటి పైకప్పు టార్పన్ల కింద ఈ అరుదైన జీవి పడుకుని ఉంది. అదేంటో తెలుసుకుందామని దాన్ని పట్టుకున్నాం. ఈ జీవి ఏంటనే విషయంపై మేము వెటర్నరీ అధికారులకు సమాచారం అందించాము. పైగా దీనికి ఏమైనా గాయమైందా అనే అనుమానంతో మేము వెటర్నరీ డాక్టర్​కు చూపించాము. అయితే ఆ జీవి అరుదైన పునుగు పిల్లి అని మాకు వెటర్నరీ డాక్టర్ తెలిపారు. దీంతో పాటు ఆయన ఆ పునుగు పిల్లికి వైద్యం చేస్తానని తెలిపారు. ఈ అరుదైన జీవి విషయంపై అటవీశాఖ అధికారులకు కూడా సమాచారం అందించాము. ఈ అరుదైన పునుగు పిల్లిని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది." - నాగరాజు, ఇంటి యజమాని

Last Updated : Apr 6, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.