ETV Bharat / state

rape:వివాహితపై అత్యాచారం.. వీడియో తీసిన నిందితుడి భార్య - విజయవాడలో మహిళపై అత్యాచారం

rape: విజయవాడలో దారుణం జరిగింది. కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అతడికి సహకరించి, ఆ దృశ్యాలను ఫోన్లో బంధించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వివాహితపై అత్యాచారం
వివాహితపై అత్యాచారం
author img

By

Published : Feb 9, 2022, 6:58 AM IST

rape: కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అతడికి సహకరించి, ఆ దృశ్యాలను ఫోన్లో బంధించిన దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్‌ స్టేషన్‌ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అజిత్‌సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతంలో ఓ వివాహిత (25) భర్త కేటరింగ్‌ పని చేస్తుంటారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. వీరి ఎదురింట్లో దిలీప్‌, తులసి అనే భార్యాభర్తలు ఉంటున్నారు. రాత్రి 11 గంటల సమయంలో వివాహిత ఇంట్లోకి వారు అక్రమంగా ప్రవేశించారు. వివాహిత నోరు మూసి, తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై భర్త రెండు సార్లు అత్యాచారం చేయగా, అతడి భార్య వీడియో, ఫొటోలు తీసింది.

తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ పిల్లలిద్దరినీ చంపేస్తానని, ఫొటోలను అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరించాడు. అంతేకాకుండా, తన స్నేహితుల కోరిక తీర్చాలని బెదిరిస్తుండడంతో బాధితురాలు మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి: కొలువుల ప్రకటనకు ఇంకెన్నాళ్లో !.. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.