ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ... విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో... పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. శాసనమండలి రద్దు తీర్మానంపై మహిళలు మండిపడ్డారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'అధైర్యపడకండి... పోరాడి సాధించుకుందాం'