ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో భాగంగా విజయవాడలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రమేష్ ప్రదర్శన ప్రారంభించారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరమనీ.. ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరిస్తూ నినాదాలు చేశారు. పొగాకు, పొగాకు సంబంధిత పదార్ధాలలో సుమారు ఏడు వేల రకాల రసాయనాలు ఉంటాయని.. వీటిలో 69 రసాయనాలు క్యాన్సర్ కారకాలని తెలిపారు. పొగాకు ఉత్పత్తులను సేవించినవారే కాకుండా వాటిని పీల్చిన వారికి కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనీ.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం నేరమన్నారు. అలాంటివారు శిక్షార్హులని హెచ్చరించారు. కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి ఎంజీ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ అక్కడున్నవారితో పొగాకుకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు.
ఇవీ చదవండి..