ETV Bharat / state

ప్రాణాలు పణంగా పెట్టినా.. 3 నెలల వేతనాలు ఏవి? - రైల్వే కాంట్రాక్టు కాంతికుల సంఘం అధ్యక్షులు నరసింహులు

లాక్ డౌన్ కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నా మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని పారిశుధ్య, సఫాయి కార్మికులు.. ఆందోళనకు దిగారు. రైల్వే అధికారులు తక్షణమే తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

krishna distrct
ప్రాణాలు పణంగా పెట్టినా..! 3 నెలల వేతనాలు ఏవి?
author img

By

Published : Jun 10, 2020, 6:50 PM IST

విజయవాడ రైల్వే స్టేషన్​లో, నగర పరిధిలోని రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు డీఆర్​ఎం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. లాక్ డౌన్​లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసినా వేతనాలు ఇవ్వలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కాంట్రాక్టు కార్మికులు డ్యూటీకి వచ్చిన వారికి, రాలేని వారికి కూడా పూర్తి వేతనాలను చెల్లించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఆదేశాలు స్పష్టంగా ఇచ్చినప్పటికీ వేతనాలు చెల్లించడంలేదని రైల్వే కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత రైల్వే అధికారులు కేంద్ర ఆదేశాలను ఖాతరు చేయకుండా.. వాటిని పరిశీలన చేస్తున్నాం, కాంట్రాక్టర్లకు చెబుతున్నామంటూ ఈ రెండు నెలలుగా కార్మికులను మభ్య పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా డివిజనల్ రైల్వే అధికారి స్పందించి వెంటనే 3 నెలల వేతనాలు ఇప్పించాలని, లేక పోతే ఈ ఆకలి పోరాటాలను అన్ని చోట్లా ఉధ్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇది చదవండి రోడ్డు మీద లారీ డ్రైవర్ల ఘర్షణ.. నిలిచిన ట్రాఫిక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.