ETV Bharat / state

KRISHNA DISTRICT JOINT COLLECTOR: 'రైతు భరోసా కేంద్రాల ద్వారానే.. ధాన్యం కొనుగోళ్లు' - కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్​

కృష్ణా జిల్లాలో ఖరీఫ్‌ వరి కోతలు ఇప్పుడిప్పుడే ఆరంభమవుతున్నాయి. ఈ సారి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్​ కె.మాధవీలత (KRISHNA DISTRICT JOINT COLLECTOR ) వివరాలు వెల్లడించారు.

కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్​ డాక్టరు కె.మాధవీలత

author img

By

Published : Nov 28, 2021, 10:34 PM IST

Updated : Nov 29, 2021, 5:42 AM IST

కృష్ణా జిల్లాలో ఖరీఫ్​ వరి కోతలు ఇప్పుడిప్పుడే ఆరంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై సర్కారు దృష్టి సారించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ రకానికి క్వింటాలు రూ.1,940, గ్రేడు-ఏ రకానికి రూ.1,960గా కనీస మద్దతు ధర చెల్లించాలని ఆదేశించింది. ఈ వివరాలను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్​ డాక్టరు కె.మాధవీలత(krishna district jc madhuveelatha) వెల్లడించారు.

మద్దతు ధర పొందేందుకు రైతులు తగిన నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ-క్రాప్‌ నమోదు చేసుకున్న రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు సిద్ధమైతే.. వారి పంట వివరాలను భరోసా కేంద్రాల్లో తెలియజేయాలని చెప్పారు. సాంకేతిక సిబ్బంది ధాన్యం నాణ్యత పరిశీలిస్తారని మీదట.. ధాన్యం ఎప్పుడు తరలించాలనేది తెలియజేస్తూ కూపన్లు అందజేస్తారని మాధవీలత తెలిపారు.

ధాన్యం కొనుగోలులో ఏ దశలోనూ రైతులు నష్టపోకుండా.. పూర్తి పారదర్శకతతో రైతులకు మద్దతు ధర వచ్చేలా తగిన ప్రయత్నాలు చేపడుతున్నామని సంయుక్త కలెక్టరు చెప్పారు. ధాన్యం విక్రయాల్లో ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఎదురైతే.. 1902, 155251, 1800 425 4402 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే...

ఇదీ చదవండి: PADDY FARMERS PROBLEMS IN EAST GODAVARI : జగన్ సారూ... ఘొల్లున ఏడుస్తున్నాం.. ఆదుకోండి

Last Updated : Nov 29, 2021, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.