విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ప్రజలు ప్రశ్నలతో ముంచెత్తారు. తన సొంత నియోజకవర్గం 50వ డివిజన్ అభ్యర్థిని వెంట పెట్టుకుని తిరుగుతున్న దేవాదాయశాఖ మంత్రికి విముఖత ఎదురైంది. ఇంటింటికీ రేషన్ బియ్యం అని... ఇలా ఎండలో నిలబెట్టారంటూ ఆ వాహనం దగ్గరకు ఓట్లు అడగడానికి వెళ్లిన మంత్రిని చుట్టుముట్టారు.
వృద్ధురాలు, ఒంటరి మహిళకు వృద్ధాప్య పింఛను ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. పాకకు 300 కరెంట్ బిల్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ ఎక్కడినుంచి తీసుకు రావాలని వాపోయారు. వాళ్లు నిలదీస్తుంటే... ఎన్నికలయ్యాక చూద్దాం అంటూ మంత్రి ముందుకు సాగారు. ఇలా.. తాను గెలిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రజలు సమస్యలతో ఏకరువు పెట్టారు ఓటర్లు.
ఇదీ చూడండి: