కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని వరద బాధితులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 500 రూపాయల ఆర్ధిక సాయం ఆందజేశారు. కొక్కిలిగడ్డ, కొత్తపాలెం, మోపిదేవి, బొబ్బర్లంక గ్రామాాల్లో కృష్ణానదికి వరద రావడంతో ఇళ్ళలోకి వరద నీరు చేరి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
652 లబ్ధిదారులకు రూ.3,26,000 ఆర్ధిక సాయాన్ని.. దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు చేతుల మీదుగా అధికారులు పంపిణీ చేశారు. మోపిదేవి మండల డిప్యూటీ తహశీల్దార్, వైకాపా కన్వీనర్ దుట్ట శివ రాజయ్య, బొబ్బర్లంక గ్రామ వీఆర్వో నీల్ కాంత్ పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: