ETV Bharat / state

కృష్ణా జల్లాలో పలు చోట్ల పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

కృష్ణా జిల్లాలోని స్థానిక ఎన్నికలు జరగని పలు పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 4 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వనుందని చెప్పారు. 15న ఎన్నికలు నిర్వహించనున్నారు.

process-of-sarpanch-election-nominations-started-in-krishna-district
కృష్ణా జల్లాలో పలు చోట్ల ప్రారంభమైన స్థానికపోరు నామినేషన్ల ప్రక్రియ
author img

By

Published : Mar 4, 2021, 3:00 PM IST

వివిధ కారణాలతో కృష్ణా జిల్లాలో ఎన్నికలు నిర్వహించని పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆరు మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వనుందని చెప్పారు. 15న ఎన్నికలు జరిపి.. అదేరోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు అన్నారు.

జిల్లాలోని విజయవాడ డివిజన్ తోట్లవల్లూరు మండలంలోని భద్రిరాజుపాలెం 10వ వార్డు.. గుడివాడ డివిజన్ పామర్రు మండలంలోని రిమ్మనపూడి 2, 6వ వార్డులు.. నందివాడ మండలంలోని చినలింగాల 2, 4, 8వ వార్డులు.. మచిలీపట్నం డివిజన్ బంటుమల్లి మండలం చినతుమ్మిడి 8వ వార్డు.. గూడురు మండలం కోకానారాయణపాలెం 4వ వార్డు.. నూజివీడు మండలం హనుమంతుల గూడెం 5వ వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. నామినేషన్లను స్వీకరించేందుకు ఆయా పంచాయతీల్లో ఎన్నికల అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

ఇదీ చదవండి: టిప్పర్​ ఢీకొని సైక్లిస్ట్​ మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.