మార్చి 14న కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు ఓటర్లకు రూ. 3,000 చొప్పున డబ్బు పంచుతూ పట్టుబడినట్లు మచిలీపట్నం డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. చందు రామారావు అనే అభ్యర్థి తరపున.. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలేనికి చెందిన బొమ్మసాని వీరాంజనేయులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ. 1 ,00,500 స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: 'తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక బరిలో భాజపా అభ్యర్థి'