ETV Bharat / state

విద్యార్థుల రూటు మారింది.. ప్రభుత్వ పాఠశాలల దశ తిరిగింది!

ప్రభుత్వ బడులు కళకళలాడనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు చాలామంది ప్రభుత్వ బడుల మెట్లు ఎక్కుతున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ప్రైవేటులో ఫీజులు చెల్లించలేని తల్లిదండ్రులు సర్కారు బడి బాట పడుతున్నారు.

govt schools eenadu
govt schools eenadu
author img

By

Published : Sep 19, 2020, 6:24 AM IST

Updated : Sep 19, 2020, 6:44 AM IST

ప్రభుత్వ బడులు కళకళలాడనున్నాయి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ప్రైవేటులో ఫీజులు చెల్లించలేని తల్లిదండ్రులు సర్కారు బడి బాట పడుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రైవేటు బడులు లేకపోవడంతో పాటు సమీప పెద్ద గ్రామాలకు పిల్లలను పంపడానికి సౌకర్యాలు లేకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. వలస ప్రాంతాలనుంచి స్వగ్రామాలకు చేరుకున్న వారు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల ప్రక్రియ పట్టణాల్లో కొంచెం ఎక్కువే ఉంటోంది.ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండడంతో సీట్ల కోసం ప్రధానోపాధ్యాయులను సంప్రదిస్తున్నారు. వచ్చే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొన్నిచోట్ల మొదట ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి ప్రాధాన్యమిస్తున్నారు. చివరలో సీట్లు మిగిలితే ప్రవేశాలు ఇస్తామని ప్రైవేటునుంచి వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతున్నారు.

వలసల నుంచి సొంత ప్రాంతాలకు..

  • బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కూలీలు, ఇతర చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు తిరిగి పెద్ద నగరాలకు ఎప్పుడెళతారో చెప్పలేని పరిస్థితి ఉంది. దీంతో సమీపంలోని ప్రభుత్వ బడులనే ఆశ్రయిస్తున్నారు.
  • ఆర్థిక ఇబ్బందుల కారణంగా తక్కువ బడ్జెట్‌తో నడిచే ప్రైవేటు బడులు మూతపడుతున్నాయి. వీటిల్లో చదివే వారిలో కొందరు ప్రభుత్వ బడులవైపు చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి.
  • కరోనా నేపధ్యంలో ప్రభుత్వ బడుల్లో పెరిగే పిల్లల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల వరకుంటుందని అధికారుల అంచనా.

మచ్చుకు కొన్ని..

  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీనగర్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేరేందుకు 120 మంది ప్రైవేటు విద్యార్థులు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినవారికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటివరకు 160 మందికి ప్రవేశాలు కల్పించారు.
  • విజయనగరంలోని కస్పాలో ప్రవేశాల కోసం 30మంది ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించారు.
  • విజయవాడలోని టంగుటూరి ప్రకాశం పంతులు పురపాలక పాఠశాలలో ఆరో తరగతిలో ఇప్పటివరకు 270 ప్రవేశాలు నిర్వహించగా, ఇందులో 60మంది ప్రైవేటు బడులనుంచి వచ్చినవారే.
  • నెల్లూరులోని కురగంటి నాగిరెడ్డి పాఠశాలలో ప్రవేశాల కోసం 237మంది ప్రైవేటు విద్యార్థులు వచ్చారు. ముందుగా ప్రభుత్వ విద్యార్థులకే ప్రాధాన్యమివ్వడంతో సీట్ల కోసం వారు నిరీక్షిస్తున్నారు. ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నందున వడపోతకు ఏదైనా పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు.

21 తర్వాత మరింత పెరిగే అవకాశం

ఈనెల 21 తర్వాత ప్రవేశాలకు వచ్చే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పట్టణాల్లో చిన్నచిన్న బడులు మూతపడడం, పేదవారు ఆదాయం కోల్పోవడం వల్ల పురపాలక పాఠశాలలపై ప్రవేశాల ఒత్తిడి పెరుగుతోంది. - రామకృష్ణ, అధ్యక్షుడు, పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య.

ఇదీ చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నిరాడంబరంగా అంకురార్పణ

Last Updated : Sep 19, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.