కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రం లో అర్చకులపై ఆలయ ఛైర్మన్ చేసిన దుశ్చర్యని కృష్ణా జిల్లా మైలవరం స్థానిక పురోహితులు ఖండించారు. దాడికి నిరసనగా ప్రదర్శనలు నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.
ఇవీ చదవండి