ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో గర్భిణి మృతి.. బంధువుల ఆందోళన

ప్రసవం కోసం వచ్చిన మహిళ మరణంతో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆమె మరణానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు.

పురిటి మహిళ మరణం.. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
author img

By

Published : Jul 18, 2019, 2:08 PM IST

ప్రభుత్వాస్పత్రిలో గర్భిణి మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళ సహా పురిటి బిడ్డ మృతి చెందటంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిన్నమ్మ అనే మహిళ ప్రసవం కోసం ఈనెల 16న ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఈ రోజు ఉదయం పురిటిబిడ్డతోపాటు చిన్నమ్మ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య, బాబు మృతి చెందారని చిన్నమ్మ భర్త రాజు ఆరోపించాడు. మృతదేహాలను మార్చురీకి తరలిస్తుండగా అడ్డుకుని.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. మృతికి గల కారణాలు అడిగినా.. వైద్యులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతురాలి భర్తను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రతి పనికి ఆసుపత్రి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారనీ.. వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి..

స్మగ్లర్లకు చిక్కిన నత్తగుల్ల.. సరిహద్దులు దాటుతోందిలా..!

Intro:ap_vzm_36_18_ncc_sikshanaku_ampikalu_avb_vis_biytes_ap10085 జాతీయ క్యాడెట్ కోర్సు శిక్షణకు ఎంపికలు నిర్వహించారు ఏ బి సి ధ్రువపత్రాల శిక్షణ ఎంపికకు మంచి స్పందన కనిపించింది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎన్ సి సి శిక్షణ ఎంపిక లు చేపట్టారు వందలాది మంది విద్యార్థులు వివిధ అంశాల్లో పోటీపడి అర్హత సాధించారు ప్రభుత్వం ఉన్నత పాఠశాల ఆర్ సి ఎం ఎం ఎస్ వి డి కళాశాలలో ఎంపికలు జరిగాయి క్రమశిక్షణ శారీరక దారుఢ్యం సాధించేందుకు మీ శిక్షణ దోహదపడుతుంది ఎన్సిసి శిక్షణ పూర్తయ్యాక అందించే ద్రువ పత్రానికి విద్య ఉద్యోగ ప్రవేశాల్లో ను రిజర్వేషన్ ఉండడంతో ఈ కోర్సు అభ్యసనకు విద్యార్థుల ఆసక్తి చూపుతున్నారు 14వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి బెటాలియన్ అధికారులు విద్యార్థుల శారీరక దారుఢ్యాన్ని ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేసి ఇ అర్హత కల్పించారు ఎంపికైన విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల్లో శిక్షణ అమలు చేయనున్నారు

Conclusion:మైదానంలో లో ఎంపిక కు హాజరైన విద్యార్థులు పరుగు పోటీలో పాల్గొన్న విద్యార్థులు వ్యాయామం చేస్తున్న విద్యార్థులు ఎన్ సి సి కార్యాలయం మాట్లాడుతున్న ఉన్నత పాఠశాల హెచ్ఎం నాగయ్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.