ETV Bharat / state

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా తెదేపా ప్రజాప్రతినిధుల లేఖ - prakasam-district-tdp-leaders-wrote-a-letter on veligonda project

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా తెదేపా ప్రజాప్రతినిధుల లేఖ

author img

By

Published : Aug 29, 2021, 12:57 PM IST

Updated : Aug 29, 2021, 1:47 PM IST

12:55 August 29

వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి రాసిన లేఖ ఉపసంహరించుకోవాలని వినతి

వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదును పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలని కోరుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రకాశం జిల్లా తెదేపా ప్రజాప్రతినిధులు లేఖ రాశారు. గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామితో పాటు జిల్లా తెదేపా ప్రజాప్రతినిధులు లేఖపై సంతకాలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకి అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తుందని లేఖలో ప్రశ్నించారు. కేంద్ర గెజిట్ లో ఆ ప్రాజెక్టుని చేర్చకపోవడం ముమ్మాటికీ ఏపీ ప్రభుత్వ వైఫల్యమే తప్ప.. ఆ ప్రాజెక్టు అనుమతులు లేనట్టు కాదని స్పష్టం చేశారు.  

  2014 పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపి, అనుమతులిచ్చిందని లేఖలో పేర్కొన్నారు. అందులో కల్వకుర్తి, నెట్టెంపాడుతో సహా వెలిగొండ కూడా ఉందని వివరించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలోనే గుర్తు చేసి, కేంద్ర గెజిట్​లో చేర్చమని లేఖ ద్వారా కోరినప్పటికీ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఫలితంగా వెలిగొండ ప్రాజెక్టుకు కేంద్ర గెజిట్ లో స్థానం లేదనే విషయాన్ని కేంద్రానికి తెలంగాణ చేసిన ఫిర్యాదులో ప్రస్తావించారన్నారు. ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపి, తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ఫిర్యాదులు చేయడం కేసీఆర్ హోదాకు తగదన్నారు. ప్రకాశం జిల్లాకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించవద్దని లేఖలో కోరారు. ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్న దశలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదీచదవండి. STEEL PLANT : స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మానవహారం

Last Updated : Aug 29, 2021, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.