అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు... పోలీసులు పేకాట శిబిరాలపై మెరుపు దాడులు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ శివార్లలో మామిడి తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. రూ.3 లక్షలు, 7కార్లు, 3 ద్విచక్రవాహనాలు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: