రాష్ట్ర సరిహద్దులు, నగరంలో ఎస్ఈబీ అధికారులు తనిఖీ చేస్తుండటంతో అక్రమార్కులు రూటు మార్చారు. కొరియర్ ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారమందుకున్న అధికారులు విజయవాడ హనుమాన్పేట్లోని సలీం పార్సిల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు . ఓ పార్సిల్లో 48 మద్యం సీసాలు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి నగరానికి కొరియర్ ద్వారా పంపుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి..