ఏటీఎం వరుస దొంగతనాలతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ నగరంలో పలు చోట్ల హైటెక్ తరహాలో 41 లక్షల రూపాయలు దోచుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హరియాణా మేవత్ ప్రాంతానికి చెందిన ముఠానే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నగరంలోని ఓ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు వారిని హర్యానా ముఠా సభ్యులుగా భావిస్తున్నారు. సత్యనారాయణపురంలో బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. ఆర్థిక ఇబ్బందులతో కుమార్తెను అమ్మకానికి పెట్టిన అమ్మ..!