కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని అన్నెరావుపేట తండాలో పోలీసులు నాటుసారా విక్రయ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. సుమారు 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాలతో రెడ్డిగూడెం ఎస్ఐ శ్రీనివాస్.. తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. గత 3 రోజుల నుంచి దాడులు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 40లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీచదవండి.