కృష్ణా జిల్లా కంచికచర్లలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రోడ్లపైకి రావద్దని రెండు రోజులుగా పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు యువకులు పెడ చెవిన పెడుతున్నారు.
విజయవాడ బుడమేరు వంతెన వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు త్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. వారు పారిపోబోయి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ముగ్గురు వ్యక్తులు కింద పడిపోయారు
విజయవాడ నగరంలో జన సంచారంపై పోలీసులు నిషేధాజ్ణలు విధించి కఠినంగా అమలు చేస్తున్నారు. విజయవాడ నగరం లోపల, బయట అన్ని మార్గాలపై వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు.
కృష్ణా జిల్లా మైలవరంలో నిబంధనలుకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పోలీసులు దగ్గర ఉండి మూసివేయించారు. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో గుంపులు గుంపులుగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరార్ధం బ్యాంక్లు పని చేసినప్పటికీ 144 సెక్షన్ ప్రభావంతో జనాలు రాకపోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు.
విజయవాడ సింగ్ నగర్లో పోలీసు ఆంక్షలు విధించి, రోడ్లపైకి రావద్దన్నా వస్తున్న యువకులను పోలీసులు గుంజీలు తీయించారు. కరోనా వైరస్ వ్యాపి నిరోధంలో ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తిచేశారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీస్ సిబ్బంది పండ్ల లారీలో పండ్లు తీసుకుని లారీని తెలంగాణ నుంచి విజయవాడ వైపునకు పంపించారు.
ఇదీ చూడండి కరోనాకు బేరాల్లేవమ్మా.. చంపేయటాలే!