ETV Bharat / state

యువతిపై అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు - మచిలీపట్నం యువతి అత్యాచారం కేసు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మచిలీపట్నం యువతి అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Police arrested the accused
Police arrested the accused
author img

By

Published : Mar 11, 2022, 7:18 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లోనే నిందితులైన పోసిన నాగబాబు, యర్రంశెట్టి మణిదీప్​లను అరెస్ట్ చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామని దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్ తెలిపారు.

నిందితులిద్దరికీ మద్యం సేవించడం, వ్యభిచార గృహాలకు వెళ్లడం వంటి చెడు వ్యసనాలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలోనే పల్లిపాలెం బీచ్​కు స్నేహితుడితో కలిసి వెళ్లి వస్తున్న యువతిపై పోసిన నాగబాబు అత్యాచారం చేయగా మణిదీప్ సహకరించారని వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితులను అరెస్ట్ చేసినట్టు మచిలీపట్నం డీఎస్పీ మాసుమ్ బాషా తెలిపారు.

ఏం జరిగిందంటే..?
సరదాగా బీచ్‌కు వెళ్లిన యువతిపై మందుబాబులు లైంగిక దాడికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా బందరు మండలం పల్లిపాలెం బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓ యువతి.. తన ప్రియుడితో బీచ్​కి వెళ్లింది. ఈ క్రమంలో గమనించిన ఇరువురు మందుబాబులు.. ప్రియుడిని చెట్టుకి కట్టేశారు. అనంతరం అతని ముందే ఆ యువతిపై లైంగిక దాడి చేశారు.

యువతి పరిస్థితిని గమనించిన ఆమె సోదరుడు నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే బాధితురాలి సోదరుడు బందరు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మచిలీపట్నంలో దారుణం.. ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.