కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచర్లలో 2018 ఆగస్టు 14న ఓ ఇంట్లో దొంగతనం చేసి 110గ్రాముల బంగారు వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఖమ్మం జిల్లా కమ్మంపాడు గ్రామానికి చెందిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 80గ్రాముల బంగారం బాధితురాలికి అప్పగించారు. అయితే పోలీసులు అప్పగించిన బంగారంలో... 20గ్రాములు రోల్డ్‌గోల్డ్ గొలుసు ఉన్నట్లు బాధితులకు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా... అప్పట్లో తాము లేమని... వారిని అడిగి ఇచ్చేలా చూస్తామని చెప్పినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది పోలీసుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... ఆర్టీసీలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు: సీఎం