కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పెనమకూరు స్టేట్ బ్యాంకులో చోరీ జరిగింది. ఈ కేసుని పోలీసులు ఐదు గంటల్లోనే ఛేదించారు. నిందితుడు కనపర్తి అఖిల్‌ను అరెస్టు చేసి రూ. 21,175 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయ పాల్ వెల్లడించారు. అఖిల్‌పై గతంలో దేవాలయాలు, చిన్న దుకాణాల్లో చోరీలు చేసినట్లు పలు కేసులు ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందని బ్యాంకులో సీసీ కెమెరాలు, లైట్లు, అలారం ఆపడంతో చోరీ జరిగిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదని డీసీపీ తెలిపారు. అయితే నిందితుడు పలుమార్లు బ్యాంకులో సంచరించినట్లు తెలియడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఫిర్యాదు అందిన 5 గంటల్లోనే కేసును ఛేదించినట్లు డీసీపీ తెలిపారు.
నిందితున్ని పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. బ్యాంకుల్లో నిరంతరం సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డీసీపీ చూసించారు.
ఇదీచదవండి: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా