జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా.. ట్రాఫిక్ నిబంధనల గురించి వాహన చోదకులకు కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని.. కారు నడిపేవారు సీటు బెల్ట్ ఉపయోగించాలని చెప్తూ... గులాబీ పూల చాక్లెట్ ఇచ్చారు. నేటి నుంచి జనవరి 24 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ సత్యానందం కోరారు.
ఇవీ చదవండి: