ETV Bharat / state

ముగ్గురు బైక్​ దొంగలు అరెస్ట్​.. 12 ద్విచక్రవాహనాలు స్వాధీనం - Bike thieves arrested in Jaggayyapeta

వ్యసనాలకు బానిసలై అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నారు ముగ్గురు యువకులు. బైక్​లను దొంగిలించి.. వాటిని అమ్మిసొమ్ము చేసుకునేవారు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు.

DSP Nageshwara Reddy
డీఎస్పీ నాగేశ్వర రెడ్డి
author img

By

Published : Jul 13, 2021, 12:17 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వ్యసనాలకు బానిసలై బైక్​లను దొంగిలిస్తున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కాలేజీ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేయగా.. ఇద్దరు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారణ చేశారు.

విజయవాడ, గుడివాడ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా బైక్​లను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితులు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేల్పుల ఉపేంద్ర, గంటా సాయి నాగేంద్రగా పోలీసులు గుర్తించారు. రికవరీ చెేసిన 12 బైక్​ల విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ రివార్డ్​లను అందించారు.

ఇదీ చదవండి:

Solar bicycle: సోలార్ సైకిల్ ఉండగా.. ఇంధన ఖర్చు దండగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.