అక్టోబర్ 2 నాటికి విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నామని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. విజయవాడ లయోలా కళాశాలలో క్రెడాయ్ ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కమిషనర్ తో పాటు, కలెక్టర్ ఇంతియాజ్ లు హజరైయ్యారు. నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు పూర్తి స్థాయి ప్రత్యక్ష కార్యచరణ ప్రారంభించామని కమిషనర్ చెప్పారు. మానవాళి పట్ల ప్లాస్టిక్ ఓ భూతంలో మారిందని, దీనిపై అందరు కలసికట్టుగా పోరాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం వాకర్స్ క్లబ్ సభ్యులకు జ్యూట్ సంచుల ను పంపిణీ చేశారు.
ఇది కూడా చదవండి.