ఇవీ చూడండి
ప్రాణం పోతున్న వ్యక్తికి శ్వాస అందించిన పోలీసులు - కృష్ణ జిల్లా నందిగామలో ప్రాణాలు కాపాడిన పోలీసులు
కృష్ణా జిల్లా నందిగామలో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయేందుకు యత్నించాడు. 100 నంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించి సమయానికి నోటి ద్వారా శ్వాస అందించి కాపాడారు. దీనిపై స్పందించిన డీఎస్పీ రమణ మూర్తి సరైన సమయంలో శ్వాస అందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన సిబ్బంది శంకర్‌బాబు, హోంగార్డు ఆనందబాబును అభినందించారు. వారికి నగదు బహుమతి అందజేసి సన్మానించారు.
100కు ఫోన్...తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులు
ఇవీ చూడండి
sample description