ETV Bharat / state

'సెలెక్ట్ కమిటీకి పంపాక మళ్లీ బిల్లులా?' - పాలన వికేంద్రీకరణ బిల్ల 2020 వార్తలు

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టం రద్దు బిల్లుల విషయంలో తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.

ap high court
ap high court
author img

By

Published : Jun 23, 2020, 6:12 AM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టం రద్దు బిల్లుల్ని శాసనసభలో ఈ నెల 16న తిరిగి ప్రవేశపెట్టడాన్ని, వాటిని మండలికి పంపడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ బిల్లులను ఇప్పటికే శాసనమండలి సెలక్టు కమిటీకి సిఫారసు చేయగా మళ్లీ ఎలా ప్రవేశ పెడతారని ప్రశ్నిస్తూ తెదేపా ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బిల్లుల విషయంలో తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలకశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, శాసనసభ స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

రద్దు తీర్మానం.. రాజ్యాంగ విరుద్ధం

ఏపీ శాసన మండలిని రద్దు చేయాలని పార్లమెంట్​ను విజ్ఞప్తి చేసూ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది ఎమ్మెల్సీల హక్కుల్ని ఉల్లంఘించేదిగా ఉందన్నారు. ఏపీ శాసనసభ చేసిన తీర్మానం ఆధారంగా పార్లమెంట్​లో ఎలాంటి బిల్లు/చట్టం చేయకుండా కేంద్ర శాసనవ్యవహారాల శాఖ కార్యదర్శి, లోక్ సభ సెక్రటరీ జనరల్​ను ఆదేశించాలని అభ్యర్థించారు.

వైకాపా అధ్యక్షుడు జగన్​ మోహన్ రెడ్డి, తెదేపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపులకు పోత్రహించడాన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్​కు విరుద్ధమైనదిగా ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైకాపా అధ్యక్షుడు జగన్​ని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి

90 రోజుల్లో ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలి: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.