ETV Bharat / state

Power cuts across the state : కష్టాలు కనలేక.. కరెంటు కొనలేక.. ఎడాపెడా విద్యుత్ కోతలకు కారణం అదే! - power cutting

Power cuts across the state : విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అధికారులు ఎడాపెడా కోతలు విధిస్తున్నారే తప్ప.. ప్రత్యామ్నాయ మార్గాలను పట్టించుకోవడం లేదు. వినియోగానికి అనుగుణంగా సరఫరా చేయలేక గ్రామీణ ప్రాంతాల్లో కోత పెడుతున్నారు. అందుకు సాంకేతిక కారణాలను చూపిస్తున్న అధికారులు.. విద్యుత్ కొనుగోలు, ఉత్పత్తిపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.

రాష్ట్రంలో ఎడాాపెడా విద్యుత్ కోతలు
రాష్ట్రంలో ఎడాాపెడా విద్యుత్ కోతలు
author img

By

Published : May 30, 2023, 8:30 AM IST

Power cuts across the state : రాష్ట్రంలో విద్యుత్ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేళాపాళ లేని విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు ఉక్కపోత భరించలేకపోతున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తక్కువ సమయం పాటు ఎక్కువసార్లు కోత విధిస్తున్నారు.

Amul Dairy: మొన్న కర్నాటక.. నేడు తమిళనాడు.. అయినా మారని ఏపీ తీరు.. రెడ్​ కార్పెట్​ వేసి మరీ సహకారం..!

వేసవికాలం ఉక్కపోతలకు తోడు... ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఒకేసారి 2,3 గంటల పాటు విద్యుత్ కోతలతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే పరిస్థితి తలెత్తడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికారులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు విద్యుత్ కోత విధిస్తున్నారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుదలకు అనుగుణంగా మండలాల వారీగా షెడ్యూల్‌ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సాధ్యమైనంత మేరకు సరఫరా చేస్తున్న డిస్కంలు.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం భారీగా కోతలు విధిస్తున్నాయి. డిమాండ్‌ మేరకు విద్యుత్‌ అందుబాటులో లేనప్పుడు మార్కెట్‌లో కొని సరఫరా చేయాలి... లేదంటే ఉత్పత్తి చేయాలి. కానీ, ప్రభుత్వం ఇవేమీ చేయకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తూ సర్దుబాటు చేస్తోంది.

11ఏళ్ల బాలికపై పలుమార్లు రేప్.. మైనర్లే నిందితులు.. ఫోన్​లో వీడియో తీసి..

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు లేని కోతలు ఇప్పుడు ఎందుకు వచ్చాయంటూ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌ మేరకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆదివారం రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 233.81 మిలియన్ యూనిట్లు ఉండగా... బహిరంగ మార్కెట్‌ నుంచి 42.2 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశారు. అయినా 0.24 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడుతుండడంతో.. లోటును సర్దుబాటు చేయడానికి ఏదో ఒక ప్రాంతంలో కోతలు విధించక తప్పడంలేదు. పగటి వేళల్లో డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్న డిస్కంలు... రాత్రి వేళల్లో అనూహ్యంగా పెరిగే డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.

రాత్రి 10 గంటల తర్వాత ఏసీల వినియోగం ఎక్కువగా ఉండటమే విద్యుత్ డిమాండ్, కోతలకు ప్రధాన కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఫీడర్లపై ఒత్తిడి పెరిగి... డిమాండ్‌ సర్దుబాటు చేయడానికి రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తూ.. అందుకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవానికి పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో లోడ్‌ను అంచనా వేయాలి. ఆ మేరకు డిస్కంలు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్‌పై ఒత్తిడి పెరిగి కొన్ని చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిపేయడం, కొద్ది సేపటికి సరఫరా పునరుద్ధరించడం వల్ల విద్యుత్‌ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. సరఫరా వచ్చి.. ఆగుతుండటంతో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది.

Single Major Subject in Degree : డిగ్రీలో సింగిల్ సబ్జెక్ట్.. పేద విద్యార్ధుల అవకాశాలపై ఎఫెక్ట్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.