ETV Bharat / state

వ్యాధుల కాలం... తస్మాత్ జాగ్రత్త! - వర్షాకాలం

వర్షాకాలం వచ్చిందంటేనే.. వ్యాధుల కాలం వచ్చేసిట్టే! సీజనల్​గా వచ్చే రోగాలు ఈ కాలం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న కొద్దీ... ఆస్పత్రుల్లో క్యూ పెరుగుతోంది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/06-August-2019/4060477_283_4060477_1565100602561.png
author img

By

Published : Aug 7, 2019, 7:02 AM IST

వ్యాధుల కాలం... తస్మాత్ జాగ్రత్త!

వాతావరణ మార్పులతో ప్రజలపై రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలతో కృష్ణా జిల్లాలో పల్లె నుంచి పట్టణం వరకూ అందరూ ఆసుపత్రుల బాట పడుతున్నారు. వారం రోజులుగా రోగుల ఆస్పత్రులకు రోగుల సంఖ్య బాగా పెరిగింది. కాలుష్య జలాలు, కలుషిత ఆహారం, దోమల కారణంగా పలు రోగాలు విజృంభిస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువగా చిన్న పిల్లలు ఉండటం బాధాకరం.

పరిసరాల పరిశుభ్రత ముఖ్యం...
ఇంటి చుట్టూ నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, వాడిపారేసిన టీ కప్పులు తీసివేయాలి. డ్రమ్ములు, ట్యాంకర్లపై మూతలు పెట్టాలి. 3-4 రోజులకోసారి ఖాళీ చేసి ఎండబెట్టాలి. దీనివల్ల లార్వా పెరగకుండా నివారించొచ్చు. ఇంటి చీకటి మూలాల్లో చెత్తచెదారం లేకుండా చూసుకోవాలి. పాత సామగ్రి తక్షణం తొలగించాలి. పూలకుండీల్లో నీళ్లు నిల్వ ఉండకుండా ఏర్పాటుచేయాలి. కర్టెన్లు శుభ్రం చేయడంతోపాటు కూలర్లలో నీళ్లు ఎప్పటికప్పుడు మార్చివేయాలి. పాత గొడుగులు, దుస్తులు ఉంటే తీసివేయాలి.

వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి...

వర్షాకాలంలో వ్యక్తిగత శుభ్రత కీలకం. 90 శాతం వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తాయి. ప్రతి ఒక్కరు చేతి శుభ్రత పాటించాలి. బయట ప్రాంతాల్లో మరుగుదొడ్లు వినియోగించేటపుడు అక్కడి తలుపులు, గడియలు ముట్టుకోవద్దు.

  • చాలామంది చేతి రుమాలు ఉపయోగించి మళ్లీ జేబులో పెడతారు. తడిసి అందులో ఫంగస్‌ ఏర్పడుతుంది. టిష్యూ కాగితాలు నాలుగైదు వెంట ఉంచుకోవడం మేలు. అవసరమైనన్ని వాడి పాడేయాలి.
  • ఈ కాలంలో తక్కువగా నీటిని తాగుతుంటారు. దాహం లేకపోయినా సరే తగ్గించకూడదు. నీటిని తాగుతుంటే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు బయటకు పోతాయి.
  • తుమ్మినా, దగ్గినా టిష్యూ కాగితం లేదంటే...మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
  • అలర్జీలను ముందే గుర్తించి చికిత్స చేసుకోవాలి.
  • వాంతులు, విరేచనాలతోపాటు టైఫాయిడ్‌, హెపటైటిస్‌ ఎ, ఈ వంటివి ప్రస్తుతం ఎక్కువగా వస్తాయి. బయట ఆహారం, అక్కడి నీళ్లు తీసుకోకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితిలోనైతే ఖరీదు ఎక్కువైనా శుచి, శుభ్రత పాటించే హోటళ్లను ఎంపిక చేసుకోవాలి.
  • తడిచిన దుస్తులతో ఎక్కువ సమయం ఉండడం వల్ల ఫంగస్‌ వృద్ధి చెందుతుంది.. దుస్తులు మార్చివేయాలి. లేదంటే బాగా పిండుకోవాలి. తల, శరీరం పొడి టవల్‌తో తుడుచుకోవాలి.
  • ద్విచక్రవాహనంపై వెళ్లేవారు రెయిన్‌కోట్‌, శిరస్త్రాణం ధరించాలి.
  • తాజా పండ్లు, కూరగాయలు.. వేడివేడిగా సూప్‌లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఇంట్లో ఒక్కరు వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డా మిగతావారంతా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే వర్షాకాలానికి ముందే ఫ్లూ, హెచ్‌1ఎన్‌1, హెపటైటిస్‌ వ్యాక్సిన్లను వైద్యుల సూచనల మేరకు ఇప్పించాలి.

సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న తరుణంలో ఏమైనా అనారోగ్యం సంభవిస్తే... తక్షణమే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. వ్యాధుల కాలం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవద్దని సూచిస్తున్నారు.

ఇదీ చదవండీ... ఆదిత్య హత్యకు.. ఆ విషయమే కారణమా!?

Intro:AP_VJA_45_06_RMP_DOCTOR_METING_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్...9394450288... కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు లో డాక్టర్ బి.సి.రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్ నామకరణం చేస్తూ ఆర్ఎంపీ వైద్యులు తీర్మానం చేశారు. గతములో కమ్యూనిటీ పారామెడికల్ అసోసియేషన్ ఉన్న పేరును మార్చడం అయినదని అసోసియేషన్ అధ్యక్షుడు పి ఎల్ వెంకట్రావు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం సవరించిన నిబంధనలకు అనుగుణంగా ఆర్ఎంపీ వైద్యులు తన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని. కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గా గ్రామాలలో క్లినిక్ల్ లునడపాలని తీర్మానం చేశారు. ఈ అసోసియేషన్ లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ,రాష్ట్రాలలోని 20 వేల మంది సభ్యులుగా ఉన్నారని వారి అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని సంఘ అధ్యక్షుడు సి.ఎల్.వెంకట్రావు తెలిపారు.....బైట్.. సియల్..వెంకట్రావు..బి.సి.రాయ్.పస్ట్ ఎయిడ్ ప్రొవైడర్ అసోసియేషన్.. అధ్యక్షుడు

Body:కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో ఆర్ఎంపీ వైద్యులు సమావేశం

Conclusion:సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అ ఆర్ఎంపీ వైద్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.