SURRENDER: ప్రధాని పర్యటన రోజు గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసిన కేసులో తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ గన్నవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పరారైన రాజీవ్ రతన్ కోసం పోలీసు బలగాలు మూడు రోజులుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ పార్టీ పెద్దలతో కలిసి స్టేషన్కు వచ్చిన రాజీవ్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇదీ జరిగింది.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ.. గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసి.. కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ బెలూన్లు ఎగరవేసినట్లు గుర్తించిన పోలీసులు.. అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇవీ చదవండి: