కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పవన్‌కల్యాణ్‌కు చూపిస్తూ రైతులు కంటతడి పెట్టారు. తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆయన వాపోయారు. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని... రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని... ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అభిమానుల కోలాహలం
పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావటంతో ఉప్పలూరు, పునాదిపాడుల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
ఇదీ చదవండి: